మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈనెలాఖరున ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాలో ప్రతినాయకుడెవరన్నది తేలలేదు. మహేష్ బాబు ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నుంచే విలన్ ని దిగుమతి చేయాలన్నది త్రివిక్రమ్ ప్లాన్.
అందుకోసం త్రివిక్రమ్ – మహేష్ చాలా పేర్లను పరిశీలించారు. అందులో ముఖ్యంగా సైఫ్ అలీఖాన్‌ని విలన్ గా తీసుకొస్తున్నారని, ఆయన రాక ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. సైఫ్ ఈ సినిమాలో నటించడం లేదని, ఇప్పటి వరకూ విలన్ ని ఖాయం చేయలేదని… సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ ముందున్నటార్గెట్.. ప్రస్తుతం విలన్ ని దొరకపుచ్చుకోవడమే.
ఆ విలన్ కూడా ఓ స్టార్ హీరో అయ్యి ఉండాలి. ఇప్పటి వరకూ తెలుగు తెర చూడని విలన్ అయితే బాగుంటుందన్నది త్రివిక్రమ్ – మహేష్ ల ఆలోచన. అందుకే వేట ముమ్మరం చేశారు. ఓ వారం రోజుల్లో విలన్ ఎవరో తేలిపోతుందని సమాచారం. ఇప్పడున్న సమాచారం ప్రకారం.. జాన్ అబ్రహం ను అనుకుంటున్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..