- Advertisement -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా నుండి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్‌కు మళ్లీ పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తుండగా ప్రస్తుతం ఐసోలేషన్ ఉన్నారు. 79 ఏండ్ల బైడెన్ గతేడాదే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నారు. అయినప్పటికీ.. రెండుసార్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నెల 21న బైడెన్‌కు తొలిసారిగా కరోనా పాజిటివ్ వచ్చింది. వైరస్ తీవ్రత పెద్దగా లేకపోవడం స్వల్ప లక్షణాలు ఉండటంతో ఐసొలేషన్‌లో ఉన్నారు.
- Advertisement -