నేనైతే ఖచ్చితంగా ట్రంప్‌ను ఓడించేవాడిని!

5
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను నిలబడి ఉంటే ట్రంప్‌ను ఖచ్చితంగా ఓడించేవాడినన్నారు జో బైడెన్. మీడియా సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయంపై విచారిస్తున్నారా.. అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన బైడెన్…డెమోక్రటిక్‌ పార్టీలో ఐక్యత కోసమే తాను అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లు బైడెన్‌ స్పష్టం చేశారు.

తాను మొన్నటి ఎన్నికల బరిలో దిగి ఉంటే ట్రంప్‌ను కచ్చితంగా ఓండిచేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ట్రంప్‌ను ఓడించేందుకు కమలా హారిస్ విశేషంగా కృషి చేశారన్నారు.

81 ఏండ్ల జో బైడెన్‌ రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఎన్నికల బరి నుండి తప్పుకుని డెమోక్రటిక్‌ పార్టీ తరపున అభ్యర్థిగా ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్‌ పేరును బైడెన్‌ ప్రతిపాదించారు.

Also Read:చలనచిత్ర పరిశ్రమకు మైలురాయి:రాజమౌళి

- Advertisement -