దేశంలో ప్రజాస్వామ్య జ్వాల వెలిగింది: బైడెన్

426
biden
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తారుమారు చేయాల‌ని అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌య‌త్నించినా . ఈ దేశంలో చ‌ట్టం, రాజ్యాంగం, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల ముందు ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జో బైడెన్ గెలిచిన‌ట్లు ఎల‌క్టోర‌ల్ కాలేజీ ప్ర‌క‌టించింది.

దీంతో జాతినుద్దేశించి మాట్లాడిన బైడెన్… ట్రంప్ వైఖ‌రిని త‌ప్పుప‌డుతూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌భావితం చేసేందుకు ట్రంప్ చివరివరకు ప్రయత్నించారని కానీ ఆ ప్రయత్నాలను సర్వోన్నత న్యాయం తిప్పికొట్టిందన్నారు.

గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితి రాలేదని.. అమెరికా చ‌రిత్ర‌లో పేజీని మార్చాల్సిన సంద‌ర్భంగా వ‌చ్చింద‌న్నారు. జోసెఫ్ బైడెన్‌కు 306 ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఓట్లు రాగా ట్రంప్‌కు 232 ఓట్లు వ‌చ్చాయి.

- Advertisement -