Joe Biden: జో బైడెన్‌కు క్యాన్సర్​

5
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ వ్యాధి నిర్దారణ అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బైడెన్ కార్యాలయం. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో బైడెన్‌కు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినట్లు వెల్లడించింది.

జో బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 2024లో బైడెన్ ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడతారని తాను ముందే చెప్పినట్టు లూమర్ తెలిపారు. బైడెన్ ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ ప్రతిష్ట కోసం రహస్యంగా ఉంచారని, ఇప్పుడు ప్రకటించడం వ్యూహమని తెలిపారు.

బైడెన్ ఆరోగ్య స్థితి పట్ల మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సంతాపం తెలియజేశారు. బైడెన్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం అన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ గురించి విని మేము బాధపడ్డాము… ఆయన కుటుంబానికి మా మద్దతు ఉంటుందని తెలిపారు.

82 ఏళ్ల బైడెన్‌కు ఇటీవల విపరీతమైన మూత్రసంబంధిత సమస్యలతో పరీక్షలు చేసిన వైద్యులు, ప్రోస్టేట్‌లో నోడ్యూల్ గుర్తించారని తెలిపారు. నివేదిక ప్రకారం, బైడెన్‌కు Gleason స్కోర్ 9 (గ్రేడ్ గ్రూప్ 5) ఉన్న ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది. ఇది ఎముకలకు వ్యాపించింది.

Also Read:ఆర్మీ..బీటెక్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్

- Advertisement -