Joe Biden: పోటీ నుండి తప్పుకున్న బైడెన్ క్లారిటీ

22
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుండి జో బైడెన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బైడెన్… దేశాన్ని ఏకతాటిపై నిలపడానికి కొత్త తరానికి అవకాశం కల్పించడానికే తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు.

ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కంటే పదవులు ముఖ్యం కాదని చెప్పారు. నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదంటూ పరోక్షంగా ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ సమర్థురాలని, డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా హారిస్​ తగిన వ్యక్తి అని అన్నారు.

యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయమని ,అమెరికా రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోందదన్నారు. దేశాన్ని ప్రేమిస్తున్నానని, అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవమని చెప్పారు. అమెరికా భవిష్యత్తు కోసం రెండోసారి ప్రెసిడెంట్‌గా పోటీ చేసే సామర్ధ్యం తనకు ఉందని కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఏది అడ్డురాకూడదని అందుకు తప్పుకున్నట్లు ప్రకటించారు.

Also Read:నందినగర్‌లో కేటీఆర్ బర్త్ డే వేడుకలు

- Advertisement -