బెయిల్ రద్దు చేస్తాం..సల్మాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు వార్నింగ్‌

465
salman khan
- Advertisement -

కృష్ణ జింకలను వేటాడిన కేసులో రాజస్థాన్ జోధ్‌ పూర్ కోర్టు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణకు హాజరుకాని పక్షంలో బెయిల్‌ని రద్దు చేస్తామని సల్మాన్‌ని హెచ్చరింది.

1998 కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ కు కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. శిక్ష‌లో భాగంగా రెండు రోజుల పాటు జైలులో ఉన్న స‌ల్మాన్ ఆ త‌ర్వాత బెయిల్‌పై బ‌య‌ట‌కి వ‌చ్చాడు. ప‌లు చిత్రాలు కూడా చేశాడు. రీసెంట్‌గా భార‌త్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం ద‌బాంగ్ 3 చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో స‌ల్మాన్‌ను కోర్టు హెచ్చరించడంతో ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

ఓ ఫిల్మ్ షూటింగ్ కోసం జోధ్‌పూర్‌కు వెళ్లిన సల్మాన్ అక్కడ మిగతా నటులతో కలిసి కృష్ణ జింకలని వేటాడాడు . ఆ కేసులో సల్మాన్ ఖాన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, నీలమ్, సోనాలీ బింద్రే, టబు కూడా నిందితులుగా కేసును ఎదుర్కొన్నారు. మిగతా స్టార్స్‌కు ఊరట లభించినా.. సల్మాన్‌ను మాత్రం దోషిగా తేల్చారు.

- Advertisement -