బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై సంచలన ఆరోపనలు చేసింది దివంగత నటి జియాఖాన్ తల్లి రబియా అమిన్. 2015లో జియాఖాన్ అనుమానాస్పద రీతిలో చనిపోయింది.ఈ కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సల్మాన్ ఖాన్ తమకు అన్యాయం చేసాడని చెప్పింది రబియా.
కోర్టులో ఈ కేసు విగిపోయేలా సల్మాన్ చేశాడని ఆమె ఆరోపణలు చేసింది. సల్మాన్ ఖాన్ అధికారులకు డబ్బులు ఇచ్చిన ఈ కేసును తప్పదొవపట్టించాడని ఓ సీబీఐకి చెందిన ఓ అధికారి తనకు చెప్పారని తెలిపారు. సల్మాన్ తనకు ప్రతిరోజు ఫోన్ చేసే వాడని… సూరజ్ పంచోలిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేవాడని సదరు అధికారి తనతో చెప్పారని ఆమె వెల్లడించారు. జియాఖాన్ మరణానికి ముందు సూరజ్ తో ప్రేమలో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంపై సల్మాన్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి.