రూ. 0 కే జియో ఫోన్‌

284
Jio phone price
Jio phone price
- Advertisement -

రిలయన్స్ జియో ఉన్నంత కాలం వాయిస్ కాల్ కు ఒక్క పైసా కూడా వసూలు చేయబోనని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. వాటాదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన, జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత రోజుకు 250 కోట్ల నిమిషాల కాల్స్ ను ఉచితంగా అందించామని, ఇకపైనా అలాగే జరుగుతుందని అన్నారు. 1980లో వేయ్యి రూపాయిలు ఇన్వెస్ట్‌ చేస్తే.. ఇప్పుడు అవి పదహారు లక్షల రూపాయలయ్యాయి.. 40 ఏళ్లలో రిలయన్స్ కంపెనీ ఆస్తులు 20 వేల రెట్లు పెరిగాయి. 125 కోట్ల జీబీ డేటాను జియో కస్టమర్లు ఉపయోగిస్తున్నారు.. జియో యూజర్లు 250 కోట్ల నిమిషాల డేటా వాడుతున్నారు. మొబైల్ డేటా వాడకంలో అమెరికా, చైనాలను దాటేశం.. జియో ప్రారంభానికి ముందు ఇండియా 155వ స్థానంలో ఉండేది.. ఇప్పుడు డేటా వినియోగంలో నెం 1 చేరుకున్నాం.. ఉచిత సర్వీసు నుంచి పెయిడ్ సర్వీస్‌కు మారినపుడు జీయో పనైపోయిందని అందరూ అనుకున్నారు.. కానీ అది అవాస్తమని జియో కస్టమర్లు నిరూపించారు..

170 రోజుల్లో 11 కోట్ల మంది జియో కనెక్షన్ తీసుకున్నారు.  జీయో ప్రైమ్‌ యూజర్లకు తమ హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు.. వాళ్లకు ఎక్కువ బెనిఫిట్స్‌ అందిస్తాం.. ఇండియాలో 78 కోట్ల ఫోన్లున్నాయి.. ఇందులో సగం మందికి ఫీచర్ ఫోన్లున్నాయి.. వారికి డేటా సేవలు అందలేకపోతున్నాయి. డేటా లేకుండా.. ఇంటర్నెట్ లేకుండా.. ఏ ఇండియన్ కూడా బాదపడకూడదు.. వచ్చే 12 నెలల్లో 99 శాతం జీయో కవరేజీ అందిస్తాం.. జీయో వల్లనే 2జీ కవరేజీ కన్నా.. 4జీ కవరేజీ పెరిగింది.. నెట్‌వర్క్ విస్తరణతో పాటు 10 వేల కస్టమర్ ఔట్‌లెట్ ఏర్పాటుచేయబోతున్నామన్నారు అంబానీ..

ambani jio

జియో నుంచి సరికొత్త 4జీ ఫీచర్ ఫోన్ ను ఆవిష్కరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆ ఫోన్ ప్రత్యేకతలను స్వయంగా వివరిస్తూ, రానున్న ఆగస్టు 15 నుంచి భారతీయులకు డిజిటల్ స్వేచ్ఛ దగ్గర కానుందని, ఆనాటి నుంచి ఏ ఒక్కరూ వాయిస్ కాల్స్ చేసుకునేందుకు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదని, ఉచితంగా ఎన్ని నిమిషాలైనా, గంటలైనా మాట్లాడుకోవచ్చని ప్రకటించారు. అన్ని జియో అప్లికేషన్లూ ముందుగానే ఇందులో లోడ్ చేసి వుంటాయని, జియో సినిమా, జియో మూవీ, జియో టీవీ యాప్స్ తో పాటు వాయిస్ కమాండ్, ప్రాంతీయ భాషల్లో సందేశాలు పంపుకునే వీలు కూడా ఉంటుందని అన్నారు. నచ్చిన సాంగ్ ను వాయిస్ కమాండ్ ద్వారా సెలక్ట్ చేసుకోవచ్చని తెలిపారు.

jio phone

ఫోన్ లో 5వ నంబర్ ఎమర్జెన్సీ బటన్ గా పని చేస్తుందని, ఎమర్జెన్సీ లొకేషన్ ను షేర్ చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకతని ముఖేష్ పేర్కొన్నారు. 4జీ ఫీచర్ ఫోన్ లో నెలకు కేవలం రూ. 153కు అన్ లిమిటెడ్ డేటాను అందిస్తామని, వాయిస్ కాల్స్ ఎన్ని చేసుకున్నా ఉచితమేనని, ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమని ముఖేష్ తెలిపారు. . ఈ సంధర్బంగా ఇండియా కా ఇంటిలిజెంట్‌ జీయో ఫోన్‌ పరిచయం చేస్తున్నామని.. రూ. 0 కే జీయో ఫోన్‌ ఇవ్వబోతున్నాం.. మీరు విన్న మాటలు నిజమే. జియో ఫోన్ కస్టమర్లకు ఉచితంగా లభిస్తుంది. ఏదైనా ఉచితమని చెబితే, అది మిస్ యూజ్ అవుతుందన్న సంగతి మీకందరికీ తెలుసు. అందుకే ఈ ఫోన్లు మిస్ యూజ్ కాకుండా చూసేందుకు, ఉచిత జియో ఆఫర్ దుర్వినియోగం కాకుండా చూసేందుకు సెక్యూరిటీ డిపాజిట్ గా రూ. 1500 తీసుకోవాలని నిర్ణయించాం. ఇది మూడేళ్ల తరువాత వెనక్కు ఇచ్చేస్తాం. 36 నెలల పాటు ఫోన్ వాడుకున్న వారికి ఈ డబ్బులు ఇస్తాం. దీంతో నికరంగా ఫోన్ ఉచితంగా వచ్చినట్టు అవుతుంది” అని ముఖేష్ తెలిపారు.

జీయో ఫోన్‌ ఆగస్ట్‌ 15 నుంచి ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని.. ప్రీ బుకింగ్ ఆగస్ట్‌ 24 నుండి చేసుకోవచ్చన్నారు. ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వారికి ముందుగా ఫోన్లు అందజేస్తామన్నారు.. సెప్టెంబర్‌ నుండి ఫోన్లు ఇండియాలో తయారవుతాయిని.. ప్రతివారంలో 50 లక్షల ఫోన్లు అందుబాటులో ఉండేలా లక్ష్యం పెట్టుకున్నామన్నారు..

- Advertisement -