చైనా అధ్య‌క్షుడిగా జిన్‌పింగ్‌..

67
- Advertisement -

చైనా అధ్యక్షుడిగా మూడోసారి జీ జిన్‌పింగ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సెంట్ర‌ల్ మిలిట‌రీ క‌మీష‌న్ చైర్మెన్‌గా కూడా ఆయ‌న ఎన్నిక‌య్యారు. బీజింగ్‌లో జ‌రుగుతున్న 14వ నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ స‌మావేశాల్లో 2,952 ఓట్లు ఏక‌గ్రీవంగా జిన్‌పింగ్‌కు పోల‌య్యాయి.

చైనా ఉపాధ్య‌క్షుడిగా హాన్ జంగ్ ఎన్నిక‌య్యారు. మూడ‌వ సారి దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన జీ జిన్‌పింగ్ రాజ్యాంగం మీద ప్ర‌మాణం చేశారు. స్టాండింగ్ క‌మిటీ చైర్మెన్‌గా ఎన్నికైన జావో లెజితో పాటు ఉపాధ్య‌క్షుడు హాన్ జంగ్ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు.

69 ఏళ్ల‌ జీ జిన్‌పింగ్ మ‌రో అయిదేళ్ల పాటు దేశాధ్య‌క్షుడిగా కొన‌సాగ‌నున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -