ప్రపంచంలోనే అతి చిన్న వయస్సు పారాగ్లైడర్ గా నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో రికార్డ్ లో పేరు నమోదు చేసుకున్న జిల్లెల్ల అన్నిక రెడ్డి (11Yrs, 7Months) ని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురవస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు అభినందించారు.
జిల్లెల్ల అన్నిక రెడ్డి హైదరాబాద్ ఉప్పల్ లోని మెరిడీయన్ స్కూల్ లో 6వ తరగతి చదువుతుంది. ఫిబ్రవరి 4, 2022 వ తేదీన మహారాష్ట్ర లోని కాంషేట్ లో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పారాగ్లైడర్ పోటీలలో పాల్గొన్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్సు (11సం. 7నెలలు) గల పారాగ్లైడర్ గా రికార్డును నమోదు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అన్నిక రెడ్డి తల్లిదండ్రులు విజయభాస్కర్ రెడ్డి, ప్రత్యూష రెడ్డి, జూపల్లి భాస్కర్ రావు, రాములు, లక్ష్మణ్, డా. రామ్మోహన్, కిషోర్ మరియు తదితరులు ఉన్నారు.