కామెడీ థ్రిల్లర్.. ‘జిగేల్’

0
- Advertisement -

త్రిగుణ, మేఘా చౌదరి లీడ్ రోల్స్ లో రూపొందుతున్న కామెడీ థ్రిల్లర్ జిగేల్. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. త్రిగుణ ను లాకర్ టెక్నిషియన్ గా పరిచయం చేస్తూ మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

హీరో క్యారెక్టరైజేషన్ హిలేరియస్ అండ్ ఎంటర్ టైనింగా వుంది. త్రిగుణ, మేఘా చౌదరిల లవ్ ట్రాక్ బ్యూటీఫుల్ గా వుంది.ఇరవై ఏళ్ళుగా ఎలా తెరవాలో తెలియని ఓ లాకర్ ని ప్రజెంట్ చేస్తూ వచ్చిన సీక్వెన్స్ చాలా ఎక్సయిటింగ్ గా వుంది.త్రిగుణ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. మేఘా చౌదరి తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకుంది. టీజర్ లో సాయాజీ షిండే, పోసాని పాత్రలు అలరించాయి.దర్శకుడు కామెడీ తో పాటు మంచి థ్రిల్ వుండే ఎంగేజింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందిచారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. టీజర్ లో టెక్నికల్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి టీజర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది.

Also Read:విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని.. 

- Advertisement -