దివంగత నటి శ్రీదేవి ఎంత బాగా నృత్యం చేయగలదో అందరికీ తెలిసిందే. ఆమెకు వారసురాలిగా వచ్చిన జాన్వీ సైతం, తన తొలి చిత్రం ‘ధడక్’లో తన డ్యాన్స్ నైపుణ్యాన్ని చూపింది. అందంతో పాటు అభినయంలోనూ పేరు తెచ్చుకున్న ఆమె, త్వరలో పాల్గొనే ఓ కార్యక్రమం కోసం తన కొరియోగ్రాఫర్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొరియోగ్రాఫర్ సంజయ్ షెట్టి, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, జాన్వి శ్రీదేవిని గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
జాన్వీ ప్రస్తుతం తక్త్ అనే చిత్రంతో బిజీగా ఉంది. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉంటే ఓ తమిళ దర్శకుడు త్వరలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ఓ సినిమా ప్లాన్ చేయగా ,ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. చిత్రంలో కథానాయికగా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని తీసుకోవాలని అనుకుంటున్నారట.
https://www.instagram.com/p/Bs75aOjDaR9/?utm_source=ig_embed&utm_medium=loading