డ్రంక్ అండ్ డ్రైవ్‌లో క్రికెటర్!

264
raider
- Advertisement -

మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి పరువు పొగొట్టకున్నాడు కివీస్ మాజీ బ్యాట్స్‌మెన్ జెస్సీ రైడర్‌. 2008-14 కాలంలో కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన రైడర్‌ స్టార్ బ్యాట్స్‌మెన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాగుడుకి బానిసై పలుమార్లు నిషేధానికి గురైన రైడర్..టీమ్ పరువు మంటగలిపాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత కూడా రైడర్ ప్రవర్తనలో మార్పురాలేదు.

తాజాగా నేపియర్‌లో తాగి వాహనం నడుపుతూ పోలీసులకి జెస్సీ రైడర్ చిక్కాడు. ఆ సమయంలో అతను పరిమితికి మించి మద్యం సేవించినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు.

న్యూజిలాండ్‌ టీమ్‌లోకి 2008లో అరంగేట్రం చేసిన జెస్సీ రైడర్.. 18 టెస్టులు, 48 వన్డేలు, 22 టీ20 మ్యాచ్‌లను ఆడాడు.టెస్టుల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన జెస్సీ రైడర్.. వన్డేల్లో మాత్రం ఓపెనర్‌గా ఆడాడు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జెస్సీ రైడర్ పట్టుబడటం ఇది మూడోసారి.

- Advertisement -