TTD:తిరుమల పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస దీక్ష

25
- Advertisement -

21వ తేదీ తిరుమల పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ నేపథ్యంలో రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన ఉన్న జీయంగారి మఠం నుండి చిన్నజీయంగారు మరియు శిష్య బృందంతో కూడి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేస్తారు. శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత టీటీడీ ఈఓ, ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారు.  జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో తిరుమల  పెద్దజీయం కి మేల్‌చాట్‌ వస్త్రాన్ని,   చిన్నజీయం కి నూలుచాటు వస్త్రాన్ని బహూకరిస్తారు.

Also Read:పేక మేడలు సినిమాకి రిపీట్ ఆడియన్స్: నిర్మాత రాకేష్ వర్రే

- Advertisement -