అభిమానుల ప్రేమే కాపాడింది:జీవిత రాజశేఖర్

517
jeevitha
- Advertisement -

అభిమానుల బ్లెస్సింగ్‌తోనే రాజశేఖర్ ప్రమాదం నుంచి భయటపడ్డారని తెలిపారు జీవిత రాజశేఖర్. కారు ప్రమాద ఘటనపై క్లారిటీ ఇచ్చిన జీవిత….. రాజశేఖర్‌కి మేజర్ యాక్సిడెంట్ జరిగిందని అభిమానుల ప్రేమతో చిన్న చిన్న దెబ్బలతో బయటపడగలిగారని చెప్పారు.

రాజశేఖర్ పరిస్ధితిపై చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారని చెప్పిన జీవిత కారు టైర్ బ్లాస్ట్ కావడంతో కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ని ఢీ కొట్టిందన్నారు. అదే సమయంలో ఆపోజిట్‌లో వస్తున్న ఒక ఫ్యామిలీ తమ కారును ఆపి కారులో రాజశేఖర్ ఉన్నట్టు గమనించారని… వాళ్ల హెల్ప్‌తో కారు నుండి బయటకు వచ్చారని చెప్పారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆయన్ని రక్షించిన వాళ్ల ఫోన్ నుండే పోలీసులకు,తనకు కాల్ చేశారని వెల్లడించారు.

ఆ తర్వాత ఎప్పటికప్పుడు పోలీసులతో టచ్‌లో ఉన్నామని వాళ్లు ఎంక్వైరీ చేశారని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చి ట్రీట్ మెంట్ ఇచ్చారని…రాజశేఖర్‌కి బెటర్ అయిన తర్వాత స్టేషన్‌కి వచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వమని పోలీసులు కోరారని చెప్పారు.

- Advertisement -