రాజమౌళి #RRR లో రాజశేఖర్‌ లేడట..!

225
Jeevitha on Rajasekhar's Role in Rajamouli's RRR
- Advertisement -

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రాజమౌళి,రామారావు,రామ్ చరణ్ అనేలా #RRR అంటూ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసి అభిమానులలో ఆసక్తిని రేకెత్తించారు మేకర్స్.

Jeevitha on Rajasekhar's Role in Rajamouli's RRR

ఇక రాజశేఖర్ ఈ సినిమాలో విలన్‌గా ఎంపిక అయ్యార‌ని, దీంతో మరో R జ‌త చేకూరింద‌ని ఇటీవ‌ల వార్త‌లు హల్ చ‌ల్ చేశాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్ గా రాజశేఖర్ చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వచ్చింది. రాజమౌళి ఆయనను సంప్రదించడం .. ఆయన ఓకే అనడం కూడా జరిగిపోయాయని వార్తలు హల్‌ చల్‌ చేశాయి.

Jeevitha on Rajasekhar's Role in Rajamouli's RRR

అయితే జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారాన్ని గురించి తాజాగా రాజశేఖర్‌ భార్య జీవిత స్పందించారు. విలన్ గా చేయమంటూ రాజమౌళి నుంచి రాజశేఖర్ కి ఎలాంటి అఫర్ రాలేదని జీవిత చెప్పారు. శివాని సినిమా లాంచింగ్ కోసం రాజమౌళి రావడం వలన అలా అనుకుని ఉంటారని అన్నారు. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. దాంతో ఈ సినిమాలో విలన్ గా ఎవరిని ఎంపిక చేయవచ్చనే విషయంపై ఫిల్మ్ నగర్‌లో జోరుగా చర్చించుకుంటున్నారు.

- Advertisement -