రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రాజమౌళి,రామారావు,రామ్ చరణ్ అనేలా #RRR అంటూ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసి అభిమానులలో ఆసక్తిని రేకెత్తించారు మేకర్స్.
ఇక రాజశేఖర్ ఈ సినిమాలో విలన్గా ఎంపిక అయ్యారని, దీంతో మరో R జత చేకూరిందని ఇటీవల వార్తలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్ గా రాజశేఖర్ చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వచ్చింది. రాజమౌళి ఆయనను సంప్రదించడం .. ఆయన ఓకే అనడం కూడా జరిగిపోయాయని వార్తలు హల్ చల్ చేశాయి.
అయితే జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారాన్ని గురించి తాజాగా రాజశేఖర్ భార్య జీవిత స్పందించారు. విలన్ గా చేయమంటూ రాజమౌళి నుంచి రాజశేఖర్ కి ఎలాంటి అఫర్ రాలేదని జీవిత చెప్పారు. శివాని సినిమా లాంచింగ్ కోసం రాజమౌళి రావడం వలన అలా అనుకుని ఉంటారని అన్నారు. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. దాంతో ఈ సినిమాలో విలన్ గా ఎవరిని ఎంపిక చేయవచ్చనే విషయంపై ఫిల్మ్ నగర్లో జోరుగా చర్చించుకుంటున్నారు.