- Advertisement -
శేఖర్ సినిమా కథ కొత్తగా అనిపిస్తుందని తెలిపారు సినీ నటి,దర్శకురాలు జీవిత. ఆమె స్వీయదర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన శేఖర్ ఈ నెల 20న విడుదల కానుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
శేఖర్ ఓ సామాన్యుడి కథ. మనలాగే సగటు మనిషి. తనకు జరిగిన అన్యాయంపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో తెరపై చూపించాం అన్నారు, మలయాళంలో సూపర్ హిట్ అయిన‘జోసెఫ్’ మూవీకి రీమేక్ ఇది అన్నారు. రాజశేఖర్, శివానీ తండ్రీ కూతుర్లుగా కనిపిస్తారని తెలిపారు జీవిత.
శేఖర్ సినిమాకి టికెట్ రేట్లు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే.. ధరలు ఉంటాయన్నారు. మా ఎన్నికలు ముగిసిన అధ్యాయం అని… ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చేసిన విషయంలో ఇప్పటికీ చింతించడం లేదు అన్నారు.
- Advertisement -