కర్నాటక ఎన్నికల ముందు బీజేపీ, కాంగ్రెస్ విజయం పై ఎంత ధీమాగా ఉన్నాయో అదే విధంగా జేడీఎస్ పార్టీ కూడా అంతే ధీమాగా ఉండేది అంటే పార్టీ ఆధిక్యం విషయంలో కాదండోయ్ కింగ్ మేకర్ కావొచ్చనే ఆలోచనలో. ఎందుకంటే కర్నాటకలో త్రిముఖ పోరు ఉన్న నేపథ్యంలో హంగ్ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు, విశ్లేషణలు మొదటి నుంచి చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ వైపే మొగ్గు చూపడంతో 2018 సీన్ రిపీట్ అవుతుందని తమదే కింగ్ మేకర్ పాత్ర అని జెడిఎస్ ఆగ్రనేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండేవారు. హంగ్ ఏర్పడితే 2018 లో మాదిరి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కుమారస్వామి ఆశించారు. తమతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టచ్ లో ఉన్నాయని, తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకున్నామని.. ఇలా గాల్లోనే మేడలు కట్టేశారు జేడీఎస్ నేతలు. కట్ చేస్తే జేడీఎస్ ఆశాలన్నీ ఆవిరైపోయాయి.
Also Read: కాంగ్రెస్ సంచలన విజయానికి.. కారణం అదే !
విడుదల అయిన ఫలితాలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ 130-140 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతుంది. మరోవైపు బీజేపీ 60-70 స్థానాలు దక్కించుకోవడమే కష్టమైపోయింది. ఇక కింగ్ మేకర్ గా చక్రం తిప్పాలని భావించిన జేడీఎస్ పార్టీ 10-20 స్థానాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 37 స్థానాలను కైవసం చేసుకున్నా జెడిఎస్ ఈసారి మాత్రం 25 కంటే తక్కువ స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. అయితే ఈసారి ఎన్నికల్లో జెడిఎస్ కు 25 కంటే తక్కువ సిట్లే వస్తాయని కౌంటింగ్ కు ముందే కుమారస్వామి స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే జెడిఎస్ ప్రభావం ఈసారి ఉండదని ఆ పార్టీ నేతలు ముందుగానే ఓ అంచనకు వచ్చినట్లు తెలుస్తోంది.హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర పోషించాలని చూసిన జెడిఎస్ కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ కు స్పష్టమైన అధికారాన్ని కట్టబెట్టారు కన్నడ ప్రజలు.
Also Read: కర్నాటకలో బీజేపీ ” ఖేల్ ఖతం ” !