బి‌ఆర్‌ఎస్ లోకి జేడీ.. నిజమేనా ?

64
jd laxminarayana
- Advertisement -

ఏపీ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ బి‌ఆర్‌ఎస్ లో చేరనున్నారా ? ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనమా ? అంటే అవుననే మాటలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో జనసేన పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన జేడీ.. ఆ తరువాత జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే జనసేన పార్టీని వీడినది మొదలుకొని ఇంతవరకు ఆయన వేరే ఏ పార్టీలో చేరలేదు. అప్పుడప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజల దృష్టి తనపై పడేలా చూసుకుంటున్నారు జేడీ లక్ష్మినారాయణ. అయితే ఒకానొక టైమ్ లో ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు గట్టిగానే వినిపించాయి..

కానీ అవన్నీ ఒట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఆ తరువాత ఆయనే సొంతంగా ఓ పార్టీ పెట్టేందుకు సిద్దమయ్యారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అవి కూడా కార్యరూపం దాల్చలేదు. ఇక ఈ మద్య పోలిటికల్ గా మరింత యాక్టివ్ అయిన జేడీ.. బి‌ఆర్‌ఎస్ చేపడుతున్న ప్రతి పనికి కూడా సమర్థిస్తూ వస్తున్నారు. ఇటీవల విశాఖా స్టీల్ ప్లాంట్ రద్దు విషయంలో బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ కేంద్రాన్ని ప్రశ్నించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

అంతే కాకుండా కే‌టి‌ఆర్ ను చూసి నేర్చుకోవాలని ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. జేడీ ఇక అప్పటి నుంచి ఆయన బి‌ఆర్‌ఎస్ లో చేరతారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇక తాజాగా విశాఖా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ తీసుకున్న చొరవను జేడీ సమర్థిస్తూ వచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈఒఐలో పాల్గొనేందుకు చర్యలు తీసుకున్న కే‌సి‌ఆర్ కు దాన్యవాదాలు అంటూ, తెలంగాణ ప్రభుత్వం బిడ్ లో పాల్గొనాలని జేడీ ట్వీట్ చేశారు. దీంతో జేడీ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన బి‌ఆర్‌ఎస్ తీర్థం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఆయన బి‌ఆర్‌ఎస్ లో చేరితే.. ఏపీ బి‌ఆర్‌ఎస్ కు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -