సొంతపార్టీ ఆలోచన విరమించుకున్నారు సీబీఐ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ స్దాపించిన లోక్‌సత్తా పార్టీలో చేరారు జేడీ. ప్రజాసమస్యల పరిష్కారానికే రాజకీయాల్లోకి వచ్చానన్న జేడీ ..అందుకే లోక్ సత్తాలో చేరినట్లు వెల్లడించారు. అధికారమంటే ప్రజలను దోచుకోవడం కాదని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేయాలన్నారు.
ప్రజల ఆలోచన మేరకే పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించినట్లు లక్ష్మి నారాయణ పేర్కొన్నారు. ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించామన్నారు. లోక్‌సత్తా పగ్గాలు చేపట్టాలని జయప్రకాశ్ నారాయణ ఆహ్వానించారని, పార్టీని ముందుండి నడిపించాలని కోరారని లక్ష్మినారాయణ తెలిపారు.
బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల్లో చేరతారంటూ ఆయనపై పుకార్లు వచ్చాయి. వాటన్నింటికీ పులుస్టాప్ పెడుతూ లోక్‌సత్తాలో తాను చేరుతున్నానంటూ ప్రకటించారు. తాజా రాజకీయ పరిస్థితులపై సోమవారం మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో ఆయన చర్చలు జరిపారు. అనంతరం లోక్ సత్తా వైపే మొగ్గుచూపారు.