వర్మ మూవీలో హీరోగా జేడీ…

231
JD Hero for Varma film
- Advertisement -

జేడి చక్రవర్తి.. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో పరిచయం అవసరం లేని పేరు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన సినీ కెరీర్‌కే కాదు, ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి కూడా వారసుడిగా ఎదిగాడు చక్రవర్తి. హీరో, విలన్, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా తనలోని  టాలెంట్‌ను తెర మీద చూపించిన చక్రీ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు.

రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నానని, దర్శకత్వం కూడా చేస్తున్నానని జేడీ చెప్పాడు. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదని… డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉగ్రం’ చిత్రంలో హీరోగా నటిస్తున్నానని చెప్పాడు. దీనికి తోడు కన్నడంలో టాప్ హీరోయిన్ అయిన పూజాక్రాంతి నిర్మిస్తున్న ‘రావణి’ చిత్రంలో ఆమె సరసన హీరోగా నటిస్తున్నానని తెలిపాడు.

ఇష్టానుసారం సినిమా తీస్తే హిట్ కాదని… కథలో దమ్ముంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని  తెలిపాడు. అందరికీ నచ్చిన అమ్మాయిని మనం పెళ్లి చేసుకోలేకపోవచ్చని… అలాగే, అందరికీ నచ్చినట్టుగా సినిమాను తీయలేమని చెప్పాడు.

- Advertisement -