నా కొడకల్లారా?..డబ్బులు తీసుకుని ఓట్లేశారు..ఆ హక్కులేదు:జేసీ

220
jc
- Advertisement -

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్నికల్లో టీడీపీ అధిక సీట్లు వచ్చిన అనేక ట్విస్ట్‌ల అనంతరం మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యలు స్వీకరించిన జేసీ..చేసిన వ్యాఖ్యలు కాంట్రావర్సీకి కేరాఫ్‌గా మారాయి.

డబ్బు తీసుకుని నాకు ఓట్లేశారు…! నన్ను పనులు చేయమని అడిగే హక్కు ఒక్క నా కొడుక్కి లేదు అని ప్రజలకు తేల్చిచెప్పారు. రేయ్ నాతో రెండు వేలు తీసుకుని ఓట్లేసి ఇప్పుడు పనులు అడుగుతారా?…నా కొడకుల్లారా మీకు అలా అడిగే హక్కు లేదురా..! అంటూ వ్యాఖ్యానించారు.

మీరు డబ్బు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే.. నేను మీకు పనులు చేయాలి అంటూ దుర్భాషలాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో దీనిపై స్పందించారు ప్రభాకర్ రెడ్డి. ఓటును డబ్బులకు అమ్ముకుంటే సమస్యల ప్తె నిలదీసే హక్కు కోల్పోతామని తాను మాట్లాడిన మాటలలో తప్పులేదని ,స్వేచ్ఛగా , నిజాయితీగా ఓటు వేయండి ప్రజాప్రతినిధిని సమస్యల ప్తె కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు ఉంటుందని ప్రజలకు చెప్పానని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోమాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -