దటీజ్ జేసీ…తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నిక

213
jc
- Advertisement -

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా స్పష్టంగా కనిపించిన సంగతి తెలిసిందే. దాదాపు 98 శాతం మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకోగా కీలకమైన తాడిపత్రి స్ధానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకుంది. సైకిల్ పార్టీ గెలుపులో కీ రోల్ పోషించారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.

టీడీపీ,వైసీపీ మధ్య స్వల్ప తేడా ఉండటంతో ఛైర్మన్ పదవిని ఎవరు దక్కించుకుంటారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఎన్నికలు ముగిసిన వెంటనే క్యాంపు రాజకీయాలకు తెరలేపగా అలెర్ట్ అయిన జేసీ తన వర్గ కౌన్సిలర్లను ప్రత్యర్థి శిబిరంలోకి తొంగిచూడకుండ ఉండటంలో సక్సెస్ అయ్యారు.

దీంతో మున్సిపల్‌ ఛైర్మన్‌ గా జేసీ ప్రభాకర్‌రెడ్డి , వైస్‌ ఛైర్మన్‌గా సరస్వతి ఎన్నికయ్యారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి …. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అవసరమైతే సీఎం జగన్ ను కలుస్తానని, సేవ్ తాడిపత్రి నినాదంతో ముందుకు వెళతనాని అన్నారు. మున్సిపాలిటీని నెంబర్ వన్ చేసి చూపిస్తానని నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని అన్నారు.

- Advertisement -