- Advertisement -
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రభాకర్ రెడ్డితో పాటు జేసీ అస్మిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అనంతపురం పోలీసులు.
బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తీసుకెళ్లారు.
ఇప్పటివకు 154 వాహనాలు నాగాలాండ్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్ ఎన్ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి.
- Advertisement -