Telangana BJP:సీట్ కోసం జయసుధ పాట్లు

45
- Advertisement -

ఒకప్పటి హీరోయిన్ జయసుధ గతంలోనే ఎమ్మెల్యే గా గెలిచారు. ఆమె మళ్లీ ఎమ్మెల్యే కావాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రాలో పుట్టి తమిళనాడులో పెరిగి తెలంగాణాలో సెటిల్ అయిన జయసుధ ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో యాక్టీవ్ కావాలనుకుంటున్నారు. బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆశ పడుతున్నారు. అంతకుముందు ఆమె అనేక పార్టీల్లో ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు బీజేపీ నుంచి రేసులోకి వస్తున్నారు. ఐతే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జయసుధ సిద్ధం అయినా.. ఆమెకు జనం ఓట్లు వేస్తారా ?, గతంలో సికింద్రాబాద్ నుంచి జయసుధ గెలిచింది.

కానీ, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. మరోపక్క ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు అప్లికేషన్ పెట్టుకోవాలని బీజేపీ అధినాయకత్వం ఇటీవల ప్రకటించింది. దాంతో, జయసుధకు మళ్లీ ఆశ పుట్టింది. జగన్ చుట్టూ తిరిగినా పెద్దగా ఆమెకు ఉపయోగం కలగలేదు. అంతకు ముందు తెలుగు దేశం పార్టీలో చేరింది. అక్కడా ఆమెకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఇప్పుడు బీజేపీలో మాత్రం ఆమె మళ్లీ గెలుస్తోందా ?. అన్నట్టు జయసుధ రెండు చోట్ల పోటీకి సిద్ధం అంటూ రెండు అప్లికేషన్లు నింపినట్లు తెలుస్తోంది.

ఇంతకీ, జయసుధ కోరుకుంటున్న ఆ సీట్లు ఏమిటో తెలుసా ?, హైదరాబాద్ లోనే. గతంలో తాను గెలిచిన సికింద్రాబాద్ సీట్. అలాగే సనత్ నగర్ సీట్. ఈ రెండు సీట్లలో ఏదొక సీట్ ఇస్తే తానూ గెలుస్తాను అంటుంది జయసుధ. కానీ, బీజేపీకి హైదరాబాద్ సిటీలో అభ్యర్థుల కరువు లేదు. కాబట్టి, జయసుధ కోరుకుంటున్న ఈ రెండు సీట్లలో ఆమెకి సీటు ఇస్తారో లేదో చూడాలి. మరోవైపు మాత్రం సీట్ తెచ్చుకోవడానికి జయసుధ తెగ పాట్లు పడుతుంది.

Also Read:పన్నీరు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -