నా భర్త వెతికింది … దొరికింది

198
Jayasudha on Nitin Kapoor
- Advertisement -

సహజనటిగా తెలుగునాట మన్ననలు అందుకున్న జయసుధ జీవితంలో ఇటీవల విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె భర్త నితిన్‌ కపూర్‌ ఇటీవలే మరణించారు. ఈ రోజు (మార్చి 17) జయసుధ పెళ్లి రోజు. 32 ఏళ్ల క్రితం ఇదే రోజున జయసుధ, నితిన్‌కపూర్‌ ఒకటయ్యారు. ఈ సందర్భంగా తన భర్త గురించి జయసుధ ఫేస్‌బుక్‌లో స్పందించింది.

తన బాధని, భర్తపై ఉన్న ప్రేమని ఫేస్ బుక్‌ పోస్టు ద్వారా అభిమానులకు తెలియజేసింది జయసుధ. సరిగ్గా ఇదే రోజు… 32 ఏళ్ల క్రితం నాకు, నితిన్‌కు పెళ్లయ్యింది. ఈ పెళ్లి రోజున మా ఇద్దరం గడిపిన ఎన్నో తీయని క్షణాలు నాకిప్పుడు గుర్తొస్తున్నాయి. ఆయన ఎక్కుడున్నా తన ప్రేమతో నన్ను, నా పిల్లల్ని రక్షిస్తూ ఉంటారు. ఆయనకు శాంతి, ఆనందం దక్కాలని ఆశీర్వదించండి. నా జీవితంలో జరిగిన విషాద ఘటనలో మద్దతు ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు’ అని పోస్టులో పేర్కొన్నారు జయసుధ.

నా ప్రియమైన భర్త నితిన్ కపూర్ ఇప్పుడు దేవతలతో కలిసి ఉన్నారు. ఆయన ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న శాంతిని… చివరికి సాధించారు. డిప్రెషన్ అనేది చాలా తీవ్రమైన మెడికల్ కండిషన్. మీడియా మా జీవితంలోని చీకటి రోజులను సంచలనంగా మార్చకుండా… ప్రైవసీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాని కామెంట్ చేసింది.

- Advertisement -