జయ పరిస్థితి అత్యంత విషమం అన్న వైద్యులు

261
jayalalitha
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పరిస్థితిపై తాజాగా అపోలో యాజమాన్యం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. జయలలిత పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అపోలో వైద్యులు ప్రకటించారు.గుండెపోటు..కార్డియాక్ అరెస్టు వచ్చిన ఆమె.. ప్రస్తుతం ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్) తో పాటు ఇతర లైఫ్ సపోర్ట్ సిస్టంల మీద ఉన్నారని ఆ బులెటిన్‌లో తెలిపింది. ఆమెకు నిపుణుల బృందం చికిత్స అందిస్తూ జాగ్రత్తగా పరిశీలిస్తోందని పేర్కొంది.

jayalalitha

కొద్దిసేపటి క్రితమే దిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్‌ వైద్యుల బృందం జయలలితను పరీక్షించిన తర్వాత ఈ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయడం గమనార్హం. అపోలో ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ పేరు మీద ఈ బులెటిన్ విడుదలైంది. జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రకటించిన వైద్యులు…సడెన్‌గా మళ్లీ పరిస్థతి విషమంగా ఉందనడంతో..ప్రజలు..అమ్మ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఈ విషయం తెలియగానే ఆమె అభిమానలు..కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అపోలో అస్పత్రికి తరలివచ్చారు. అమ్మ ఆరోగ్యం కోలుకోవాలని..మళ్లీ జయను సాధారణంగా చూడాలని పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుకు గురైన ఆమెకు సీసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.

jayalalithaa

- Advertisement -