తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించి పదిరోజులు గడిచింది. అయినా అమ్మ మరణంపై ఇంకా అనుమానాలు వీడడంలేదు. ఇదే సమయంలో జయ మరణంపై అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. చెన్నై ఆపోలో ఆసుపత్రిలో అమ్మ అనారోగ్యంతో చేరిన నాటి నుంచి, 75 రోజుల పాటు ఏం జరిగిందో బయటి వారికి ఎవ్వరికి తెలియదు. కేవలం అమ్మకు చికిత్స అందించిన వైద్యులకు మాత్రమే ప్రతీ విషయం తెలిసే అవకాశం ఉంది. కానీ, ఆ విషయాలేవీ బయటకు రాలేదు.దీన్నిబట్టి అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలను డాక్టర్లు గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.
ఆసుపత్రి వైద్యులు చివరగా చేసిన ప్రకటన కారణంగా రికార్డులు అమ్మ గుండెపోటు కారణంగానే మరణించిదని స్పష్టం చేస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం శశికళ విషం పెట్టడడం వల్లనే అమ్మ మరణించిదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు అమ్మ మరణం విషయంలో మరో వార్త సంచలనంగా మారింది. జయలలిత షుగర్ వ్యాధి వల్ల చనిపోయారని, చికిత్సలో భాగంగా వైద్యులు అమ్మ కాళ్లు తొలగించారని, అందుకే ఆమె పార్థీవదేహాన్ని కాళ్లు కనిపించకుండా జాతీయజెండాతో కప్పారని కొందరు చెబుతున్నారు. అయితే జయలలిత మరణం విషయంలో వస్తున్న ఎన్నో రూమర్లలో ఇది ఒక రూమర్ అని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే, జయలలిత పార్థీవదేహం బయటకు కనిపించింది మొదలు ఎక్కడా ఆమె పాదాలు కనిపించింది లేదు. పైగా జాతీయ జెండాను అమ్మ కాళ్ల కిందివరకు కప్పేశారు. అదీకాక, అమ్మకు దహన సంస్కారాలు చెయ్యాల్సి ఉన్నా.. ఖననం చేశారు. అంతిమ సంస్కారాలల్లో కూడా ఎక్కడ అమ్మ కాళ్లు రివీల్ కాలేదు.
శవపేటికలో జయలలిత పార్థీవ దేహాన్ని పడుకోబెట్టిన సమయంలో కూడా,జాతీయ జెండాను కాళ్ల చివరి వరకు ఉంచారు. ఆ సమయంలో జయలలిత పార్థీవదేహాన్ని చూసిన ఎవ్వరికైనా.. అసలు కాళ్లు ఉన్నాయా? లేవా? అన్న అనుమానం రాక మానదు. అయితే ఇదంతా చికిత్సలో భాగంగానే జరిగి ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ వార్తలకు సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిజానిజాలేంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.