జయలలితకు సంబంధించిన ఆడియో క్లిపులు విడుదల

296
jayalalitha
- Advertisement -

తమిళ ప్రజలు ప్రేమతో అమ్మా అని పిలుచుకునే దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో చేరడంతో ఆమె అభిమానులు అల్లాడిపోయారు. కోట్లాది మంది ప్రజలు అమ్మకు ఏమైంది.. ఎలా ఉంది తెలుసుకోవాలని తప్పించుపోయారు. ఆస్పత్రికి వెళ్లినప్పటి నుంచి అమ్మ కోలుకుంటుంది అని డాక్టర్లు చెప్పడం తప్పా.. ఆమె స్వయంగా మాట్లాడిన వీడియో కానీ ఆడియో కానీ చూపించలేదు. 75 రోజులు ఆస్పత్రిలోనే ఉన్న జయలలిత తుదిస్వాస విడిచారని వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశాల్ని విడుదల చేశారు.

jayalalitha In apollo

ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మాట్లాడిన ఆడియో రికార్డులను అరుముగ స్వామి కమిషన్ విడుదల చేసింది. 52 సెకన్ల నిడివి గల ఆడియోలను ఈ కమిషన్ శనివారం విడుదల చేసింది. ఈ ఆడియోని ఆమె బంధువైన వ్యక్తిగత ఫిజీషియన్ డాక్టర్ శివకుమార్ కమిషన్ కు సమర్పించారు. ఈ అరుముగ స్వామి కమిషన్ జయలలిత మృతికి గల కారణాలపై విచారణ జరుపుతోంది.

ఒక ఆడియోలో ఆమె డాక్టర్ తో మాట్లాడుతున్నారు. మీ బీపీ లెవెల్స్ 140/80కి చేరుకుందని డాక్టర్ చెప్పగా.. ఏం కాదు ఇది నాకు మాములే అని జయ సమాధానం ఇచ్చారు. మరో ఆడియోలో విపరీతమైన దగ్గుతో వైద్యుడికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. అంటే ఈ ఆడియోలను గమనించినట్లైతే.. ఆమె వైద్యం తీసుకొనే సమయంలో స్పృహలోనే ఉన్నారని తెలుస్తోంది. కాగా తూత్తుకుడి కాల్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ ఆడియో క్లిప్పులను విడుదల చేయించిందని ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ఆరోపించారు.

- Advertisement -