అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన తాజా చిత్రం ‘మహానటి’. ఈ సినిమా బుధవారం విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకెళుతుంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించగా సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, క్రిష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు సీనియర్ నటీనటుల పాత్రలో నటించి మెప్పించారు.
వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై సినీ ప్రముఖుల నుంచే కాక రాజకీయ ప్రముఖు నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీని చూసిన లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ ట్విట్టర్ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘‘సావిత్రిపై ఎంతో ప్రేమతో ఈ బయోపిక్ తెరకెక్కించారని, మహానటి సావిత్రిని ఈ సినిమాలో అద్భుతంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూపించారన్నారు. ఈ సినిమాలోని నటీనటులు, తెర వెనుక పనిచేసిన బృందం పని తీరుకు నిదర్శనమన్నారు. నిర్మాతలు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి సావిత్రిని మళ్లీ గుర్తుకు తెచ్చారు. కన్నీరు ఆపుకోవడం కష్టం. కీర్తి సురేశ్, సమంత అద్భుతమైన నటను కనబరిచారు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.
Watched #Mahanati , the lovingly made biopic of Savitri, the incomparable artiste & the unparalleled creative genius. All the actors, those behind the screen, the producers & director did a fabulous job. The film brought the great actress to life – hard to control tears.
— Jayaprakash Narayan (@JP_LOKSATTA) May 10, 2018