బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’. బోయపాటి గత సినిమాలన్నీ మాస్ టైటిల్స్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లకొండ శ్రీనివాస్‌తో బోయపాటి చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. గత సినిమాల్లో లాగా కాకుండా శ్రీను ఇప్పుడు కొంచెం క్లాస్ టచ్ తో వస్తున్నట్లు ఫస్ట్ టీజర్‌లో కనిపించాడు.. టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ చాలా క్లాస్ గా ఉండటంతో ఇది బోయపాటి మార్క్ కాదే అనే డౌట్ అందరిలో కలిగింది. అయితే తాజాగా వచ్చిన టీజర్‌లో మాత్రం ఊర మాస్‌గా కనిపిస్తున్నాడు..
శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు. ఆగస్ట్ 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర పోస్టర్స్ విడుదల చేసి మూవీపై మాంచి హైప్ తీసుకురాగా, రీసెంట్ గా టీజర్ విడుదల చేసి సినిమాను మాస్ యాంగిల్ తో పాటు క్లాస్ యాంగిల్ లోను ప్రెజెంట్ చేస్తాడనే హింట్ ఇచ్చాడు. ఇందులో శ్రీనివాస్ తో సహా మొత్తం ఆరుగురు హీరోలు, మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ భారీ ఆశలు పెట్టుకున్నాడు.