31న….’జయజానకి నాయక’

244
jaya janaki nayaka audio on July 31st
- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’. బోయపాటి గత సినిమాలన్నీ మాస్‌ టైటిల్స్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లకొండ శ్రీనివాస్‌తో బోయపాటి చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. గత సినిమాల్లో లాగా కాకుండా శ్రీను ఇప్పుడు కొంచెం క్లాస్ టచ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల ఈ చిత్ర పోస్టర్స్ విడుదల చేసి మూవీపై మాంచి హైప్ తీసుకురాగా, రీసెంట్ గా టీజర్‌తో సినిమా అంచనాలను మరింతగా పెంచేశాడు. మాస్‌-క్లాస్ యాంగిల్‌ని మిక్స్‌ చేస్తూ డైలాగ్స్‌ని ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాలో  శ్రీనివాస్ తో సహా మొత్తం ఆరుగురు హీరోలు, మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట.

 jaya janaki nayaka audio on July 31st
ఈ సినిమా కోసం ఎన్నడూలేని విధంగా.. విశాఖపట్నం సమీపంలో మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఓ సెట్ ను నిర్మించింది చిత్ర బృందం. బీచ్ ఫెస్టివల్ నేపధ్యంలో ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో ఓ ఎనర్జిటిక్ నెంబర్ ను పిక్చరైజ్ చేయనున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల నడుమ ఈ ఎనర్జిటిక్ అండ్ రోమాంటిక్ బీచ్ ఫెస్టివల్ సాంగ్ చిత్రీకరణ జరిగింది.ఈ సెట్ సినిమాకే హైలైట్ కానుంది.

ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!

- Advertisement -