అమెరికాలో తెలుగు మహిళ అరుదైన ఘనత

18
- Advertisement -

అమెరికాలో తెలుగు మహిళ అరుదైన ఘనత సాధించింది. కాలిఫోర్నియాలోని శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జీగా జయ బాదిగ నియ‌మితుల‌య్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జ‌డ్జీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి వ్య‌క్తిగా ఆమె నిలిచారు.

2022 నుంచి ఇదే కోర్టులో క‌మీష‌న‌ర్‌గా జయ కొన‌సాగుతున్నారు. విజ‌య‌వాడ‌కు చెందిన జ‌య …హైద‌రాబాద్‌లో తన గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిన జయ.. బోస్ట‌న్ విశ్వ‌విద్యాల‌యంలో ఎంఏ పూర్తి చేశారు. అనంతరం శాంటా క్లారా విశ్వ‌విద్యాల‌యం నుంచి లా ప‌ట్టా అందుకున్నారు.

2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ చేశారు య. 10 ఏళ్ల‌కు పైగా న్యాయ‌వాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌ కొన‌సాగించారు.

Also Read:రేవ్ పార్టీకి వెళ్లే వ్యక్తిని కాదు:శ్రీకాంత్

- Advertisement -