పోస్ట్‌ ప్రొడక్షన్‌లో జయ బి. వైశాఖం…

222
Jaya.B 's 'Vysakham' In Post-Production
- Advertisement -

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రం షూటింగ్‌ పూర్తి కావచ్చింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ – ”ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ కలిసి చూసి ఎంజాయ్‌ చేసే మంచి సినిమాగా ‘వైశాఖం’ రూపొందుతోంది. లవ్‌లీ’ తర్వాత మళ్ళీ సూపర్‌హిట్‌ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా ‘వైశాఖం’. ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌ మిక్స్‌ అయిన ‘వైశాఖం’ అపార్ట్‌మెంట్స్‌ నేపథ్యంలో సాగుతుంది. డైరెక్టర్‌గా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్‌గా పెద్ద హిట్‌ రేంజ్‌కి వెళ్తుంది. కజక్‌స్థాన్‌లో తీసిన సాంగ్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌ అవుతాయి. షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌లో వుంది. ప్రస్తుతం ఎడిటింగ్‌, డబ్బింగ్‌కి సంబంధించిన వర్క్‌ జరుగుతోంది” అన్నారు.

Jaya.B 's 'Vysakham' In Post-Production Stages

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ – ”చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ చిత్రాలు జయకి డైరెక్టర్‌గా చాలా మంచి పేరు తెచ్చాయి. అంతేకాకుండా మంచి కమర్షియల్‌ హిట్స్‌ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘వైశాఖం’. జయ దర్శకత్వంలో సినిమా అనగానే బయ్యర్స్‌ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. నా చిత్రాలకు చేసే పబ్లిసిటీ కూడా పెద్ద స్థాయిలో వుంటుంది కాబట్టి బిజినెస్‌ పరంగా చాలా మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. ఇది చిన్న చిత్రం అయినా భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నాం. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో తీస్తున్న ‘వైశాఖం’ మా బేనర్‌లో వచ్చిన ‘లవ్‌లీ’కి రెట్టింపు విజయాన్ని అందిస్తుందన్న కాన్ఫిడెన్స్‌ వుంది. ఈ చిత్రానికి ఓవర్సీస్‌ నుండి కూడా బిజినెస్‌ పరంగా మంచి ఆఫర్స్‌ రావడం హ్యాపీగా వుంది. అలాగే హిందీ, తమిళ్‌ రైట్స్‌ కోసం కూడా ఆఫర్స్‌ రావడం ఈ సినిమా మీద వున్న క్రేజ్‌కి నిదర్శనం” అన్నారు.

Jaya.B 's 'Vysakham' In Post-Production Stages

హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, శశాంక్‌, లతీష్‌, కీర్తి నాయుడు, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Jaya.B 's 'Vysakham' In Post-Production Stages

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.

- Advertisement -