జవాన్..వరల్డ్ వైడ్ వసూళ్లెంతో తెలుసా?

27
- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పఠాన్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు షారుఖ్‌. తొలిరోజు నుండే బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసింది జవాన్. ఇప్పటివరకు బాలీవుడ్లో రూ.444 .69 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని వసూలుచేయగా తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా రూ .60 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన మొత్తం వసూళ్లు రూ.883 కోట్ల రూపాయలు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది ఈ చిత్రం.హీరోయిన్‌గా దీపికా పదుకొనే నటించగా విలన్ గా విజయ్ సేతుపతి అద్భుతమైన నటనను ప్రదర్శించారు.

Also Read:ఆసీస్ తో పోరు.. టీమిండియాకు అగ్నిపరిక్షే?

- Advertisement -