దేశం కోసం మౌనంగా ఉన్నా…

308
Vicky Vishwakarma
Vicky Vishwakarma
- Advertisement -

చివరి క్షణం వరకు దేశం కోసమే పొరడతానని స్పష్టం చేశారు విక్కీ విశ్వకర్మ. బుద్గామ్ జిల్లాలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా సామ‌గ్రిని మోసుకెళ్తున్న ఓ జ‌వానుపై క‌శ్మీర్ యువ‌త దాడి చేస్తున్న వీడియో నెట్‌లో ఎంత సంచ‌ల‌నం రేపిందో తెలిసిందే. యువ‌త త‌న‌పై దాడి చేస్తున్న స‌మ‌యంలో త‌న చేతిలో ఆయుధాలు ఉన్నా.. ఆ జ‌వాను చూపిన స‌హనానికి నెటిజ‌న్లు జోహార్లు ప‌లికారు.

ఒడిశాలోని సాంబాపూర్‌ జిల్లా కిట్టారాజపూర్‌కు చెందిన విక్కీ.. ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. ఆ సంఘటన జరిగిన రోజున అక్కడి యువత ‘పాకిస్థాన్ జిందాబాద్, గో ఇండియా- గో బ్యాక్’’ అని నినాదాలు చేస్తూ రెచ్చగొట్టినా.. నిగ్రహం కోల్పోలేదు. రాళ్లు రువ్వే వారిని చూసి నేను భయపడను. ఈ ప్రాంతం చాలా సున్నితమైన ప్రాంతం. మమ్మల్ని మేము రక్షించుకుంటూ దేశ ప్రయోజనాలు ఏవిధంగా కాపాడాలో మాకు శిక్షణలో భాగంగా నేర్పించారు. అందుకే, ఆ సంఘటన చోటుచేసుకున్న సమయంలో నేను మౌనంగా ఉన్నాను. నా విధులను నేను సక్రమంగా నిర్వర్తించాలనుకున్నాను. దేశ క్షేమం కోసం ఆ సమయంలో స్పందించలేదు. నా చివరి శ్వాస వరకు దేశానికి సేవ చేస్తాను’ అని విశ్వకర్మ చెప్పారు.

ఆ ఘటనపై విశ్వకర్మ తల్లి మాట్లాడుతూ, సరిహద్దుల్లో విధులకు తన కొడుకును వేశారంటే మొదట్లో భయపడ్డానని, అయితే, ఆ సంఘటన జరిగిన రోజున.. తన కొడుకు ఎంతో సహనంతో ప్రవర్తించి గర్వపడేలా చేశాడని చెప్పారు. భవిష్యత్తులో కూడా తన కుమారుడు దేశానికి సేవ చేస్తారని తెలిపారు.

ఏప్రిల్ 9న శ్రీనరగ్‌లో ఉప ఎన్నికలకు సంబంధించిన విధులు నిర్వహించుకుని తిరిగి వస్తున్న సీఆర్‌పిఎఫ్ జవాన్లపై  జరిగిన దాడిని  టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, క్రికెటర్ గౌతమ్ గంభీర్ లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

- Advertisement -