ఆగని జవాన్ సునామీ!

13
- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టగా రెండోరోజు కూడా అదే జోరు కంటిన్యూ అయింది. రెండు రోజుల్లో దాదాపు రూ.250 కోట్లు వసూలు చేయగా మూడో రోజు కూడా జవాన్ సునామీ ఆగలేదు.

మూడో రోజు ఏకంగా 144 కోట్లకి పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. ఇక హిందీలో ఏకంగా 68.72 కోట్లని అందుకుంది. దీనితో మూడో రోజు వసూళ్లతో కలిసి ఏకంగా 384 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది.

మొత్తానికి అంచనాలకు తగ్గట్టుగానే జవాన్ సునామీ ఆగడం లేదు. తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. సంజయ్ దత్, దీపికా పదుకొనె లు కీలక పాత్రలు పోషించగా అనిరుద్ సంగీతం అందించారు.

Also Read:ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు!

- Advertisement -