సాయిధరమ్ తేజ్ కు ప్రస్తుతం కొద్దిగా బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. కర్టసీ కోసం నక్షత్రం సినిమాలో ఓ పాత్ర చేయడానికి ఒప్పుకున్న సాయి ధరమ్ తేజ్ కు ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే ఇప్పుడు బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జవాన్’ సినిమాపై గంపెడాశలు పెట్టుకున్నాడు ధరమ్ తేజ్. అయితే, ఈ సినిమా విడుదల అంతకంతకూ ఆలస్యం కావడం ఈ మెగా హీరోను కలవరపెడుతోంది.
మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయాలనుకున్నారు. కానీ, అదే రోజున ‘పైసా వసూల్’ రానుండటంతో అక్టోబర్ 1కి వెళ్లినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వస్తున్న ‘జవాన్’ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ కాకపోయినా ఆ సినిమాను మార్కెటింగ్ చేసే భాద్యతలు తీసుకున్నాడు.
అయితే ఈ సినిమా ఎడిటర్ కట్ చూసిన దిల్ రాజు చాలా అసంతృప్తి చెందాడని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు అనుకున్నంత స్థాయిలో తీయలేదుని అభిప్రాయపడ్డాడు. అందుకని అలాంటి కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేయమని సలహాలు కూడా ఇచ్చాడట దిల్ రాజు. ఈ కారణాలతో ధరమ్ తేజ్ భారీగా హోప్స్ పెట్టుకున్న జవాన్ విడుదల మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని టాలీవుడ్ టాక్. మెగా అభిమానులకి ఈ ఆలస్యం కాస్త నిరాశను కలిగించినా, వెయిట్ చేయక తప్పదు మరి.