పాకిస్థాన్ కోచ్‌గా జేస‌న్ గిలెస్పీ రాజీనామా..

1
- Advertisement -

పాకిస్థాన్ టెస్టు జ‌ట్టు కోచ్ ప‌ద‌వికి జేస‌న్ గిలెస్పీ రాజీనామా చేశారు. టెస్టులకు తాత్కాలిక కోచ్‌గా మాజీ పేస్ బౌల‌ర్ అకిబ్ జావెద్‌ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఆస్ట్రేలియా మాజీ బౌల‌ర్ గిలెస్పీ స్థానంలో జావెద్ విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు.

గిలెస్పీ కాంట్రాక్టు 2026 వ‌ర‌కు ఉన్న‌ది. కానీ ఇటీవ‌ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, గిలెస్పీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం లేదు. దీంతో కోచ్ పదవి నుండి తప్పుకున్నారు గిలెస్పీ. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే రెండు టెస్టుల‌కు అకిబ్ జావెద్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. డిసెంబ‌ర్ 26వ తేదీ నుంచి సౌతాఫ్రికాతో పాకిస్థాన్ తొలి టెస్టు ఆడ‌నున్న‌ది.

Also Read:TTD: అక్కగార్ల గుడిలో కార్తీకమాస పూజలు

- Advertisement -