- Advertisement -
జపాన్ ప్రధాని ఫూమియో కిషిడకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆ దేశ కేబినెట్ ప్రతినిధి ఆదివారం నాడు వెల్లడించారు. శనివారం నాడు కిషిడ జలుబు, జ్వరంతో బాధపడ్డారు. దీంతో పీసీఆర్ టెస్టు చేయించుకున్నారు. ఈ టెస్టులో పాజిటివ్ ఫలితం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వారం పాటు వెకేషన్‌లో గడిపిన కిషిడ.. ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చారు. అనంతరం కరోనా సోకడంతో ప్రస్తుతం తన అధికారిక నివాసంలోనే చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారని సమాచారం. ఒక్క శనివారం నాడే జపాన్‌లో 2.5 లక్షల కరోనా కేసులు నమోదవడం గమనార్హం.
- Advertisement -