జాన్వీ నుంచి డిఫ‌రెంట్ స్టేట్ మెంట్

682
janvi kapoor
- Advertisement -

శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ స్క్రీన్ ప్ర‌జెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. పైగా బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇక సోషల్ నెట్వర్కింగ్ లో జాన్వీ కపూర్ ఫొటోలు అయితే ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తాయి. తెర‌పైనే కాదు, తెర వెనుక కూడా అత్యంత అందంగా క‌నిపించే భామ‌గా కూడా జాన్వీ కపూర్ కి మంచి పేరు ఉంది. మొత్తమ్మీద సోష‌ల్ మీడియాలో బ్ర‌హ్మాండ‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది జాన్వీ కపూర్. అసలు జాన్వీ గురించి ఇంత చెప్ప‌డానికి ఒక కారణం ఉంది.

జాన్వీ కపూర్ త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ పై క్రేజీ కామెంట్స్ చేసింది. నైట్ షూట్ లో షూట్ చేస్తే.. త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ త‌న‌కు న‌చ్చ‌ద‌ని జాన్వీ కపూర్ చెప్పింది. నైట్ షూట్ లో తన ఫేస్ లో అలసట బాగా కనిపిస్తోంది అని, అందుకే ఆ సమయంలో షూట్ చేసిన సీన్స్ లో త‌ను త‌న‌కు న‌చ్చ‌నంటూ జాన్వీ చెప్పింది. వెండి తెర‌పై త‌నను త‌ను చూసుకోవ‌డం బ‌హుక‌ష్టం అని జాన్వీ కపూర్ చెప్పడం మొత్తానికి హాట్ టాపిక్ అయింది. నిజానికి జాన్వీ కపూర్ మంచి అందగత్తె. అలాగే ఫిజిక్ పరంగా కూడా అమ్మడు అన్నీ పెర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తోంది.

అందుకే, ఇలాంటి హీరోయిన్ నుంచి పై కామెంట్స్ వినిపించడంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అసలు లక్షల మంది మెచ్చిన‌, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక హీరోయిన్ ఈ త‌ర‌హాలో స్టేట్ మెంట్ ఇవ్వ‌డం నిజంగా షాకింగ్ విషయమే. సహజంగా తెర‌పై క‌నిపించే వారు.. త‌మ‌ను తాము చూసుకుని మురిసిపోతుంటారు. కానీ జాన్వీ కపూర్ మాత్రం కాస్త డిఫ‌రెంట్ స్టేట్ మెంట్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి…

- Advertisement -