భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్లలో.. అతిలోక సుందరి శ్రీదేవి అగ్ర కథానాయిక. అలాంటి అతిలోక సుందరి అందానికి నేటి తరంలో ప్రతిరూపంగా నిలిచింది జాన్వీ కపూర్. తల్లికి తగ్గ తనయ అని అనిపించుకోకపోయినా, తన ఫిజిక్ తో తన తల్లిని మాత్రం గుర్తుకు తెస్తోంది. అందుకే, జాన్వీ కపూర్ అంటే సౌత్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. పైగా ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో సౌత్ లో కూడా అడుగు పెట్టింది. అటు తమిళంలో టాప్ స్టార్ విజయ్ తో కూడా ఓ సినిమాకి కమిట్ అయ్యిందని టాక్.
సో.. ఇటు ఎన్టీఆర్, అటు విజయ్.. ఈ ఇద్దరి సరసన జాన్వీ కపూర్ రొమాన్స్ చేశాక, ఇక డౌట్ ఏముంది ?, సౌత్ సినిమా రంగంలో ఆమెదే హవా. ఇది ముందే గుర్తించారు సౌత్ ఫిల్మ్ మేకర్స్. అందుకే, ప్రస్తుతం ఏ పెద్ద సినిమా గురించి మాట్లాడినా జాన్వీ కపూర్ ప్రస్తావన వస్తోంది. ఐతే, తాజాగా రామ్ చరణ్ సినిమాలో కనిపించే అవకాశం వస్తే జాన్వీ కపూర్ నో చెప్పింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా ఇప్పటికే ఖరారు అయింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Also Read:అవిశ్వాస తీర్మానం…ఎన్ని సక్సెస్ తెలుసా?
ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా బలమైన ట్రాక్ ఉంది. కాబట్టి క్రేజ్ ఉన్న హీరోయిన్నే తీసుకోవాలని బుచ్చిబాబు ఆశ పడ్డాడు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ ను అడిగాడు. ఆమె కథ కూడా వింది. ఐతే, ఆమె ఈ సినిమా ఒప్పుకోకపోవడానికి ఓ కారణం ఉందట. జాన్వీ కపూర్ ను ఈ సినిమాకి ఏకంగా 110 రోజులు డేట్స్ కేటాయించమన్నారట. కానీ, జాన్వీ కపూర్ కి ఉన్న వేరే కమిట్ మెంట్స్ వల్ల.. ఆమె చరణ్ సినిమాని చేయలేను అని చెప్పేసింది. ఈ సినిమాకి 200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు.
Also Read:పార్టీలు రెడీ.. నోటిఫికేషన్ ఎప్పుడు ?