టాలీవుడ్‌పై ప్రశంసలు జల్లు కురిపించారు నటి జాన్వీకపూర్. నటీనటుల నుండి సాంకేతిక నిపుణుల వరకు ప్రతి ఒక్కరి పని వేళలను తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో గౌరవిస్తుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో బాలీవుడ్ ప్రొడక్షన్లు కేవలం డెడ్‌లైన్ల ఆధారంగానే సాగుతుంటాయని వెల్లడించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న జన్వీ కపూర్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ మరియు టాలీవుడ్ పరిశ్రమల మధ్య ఉన్న వ్యత్యాసాలపై తన అభిప్రాయాలను పంచుకుంది. సినిమా సెట్స్‌లో ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కలిగి ఉన్నందుకు ఆమె తెలుగు చిత్ర పరిశ్రమను ప్రశంసించింది. కఠినమైన సమయపాలన కంటే సృజనాత్మకత, సినిమా పట్ల ఉన్న ప్యాషన్‌కే తెలుగు సినిమా రంగం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని….హిందీ చిత్ర పరిశ్రమ మాత్రం ప్లానింగ్…ఎగ్జిక్యూషన్ మరియు షెడ్యూల్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతుందని ఆమె అభిప్రాయపడింది.
సౌత్ సినిమా సెట్స్‌లో ఒక రకమైన ప్యాషన్… గర్వం కనిపిస్తాయి. అక్కడ కేవలం ఒక ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి, డెడ్‌లైన్లను అందుకోవాలి అనే ధోరణి ఉండదు. ఎంత సమయం పట్టినా సరే ఒక మంచి సినిమాను రూపొందించాలనే చూస్తారు. కొన్నిసార్లు ఈ అతి జాగ్రత్త వల్ల సృజనాత్మకత పరంగా రాజీ పడాల్సి వస్తుంది…. అయితే అలా పక్కాగా ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని తెలిపింది.
Also Read:మౌంట్ రష్‌మోర్‌పై ట్రంప్..!
టాలీవుడ్‌లో నేను కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే పూర్తి 12 గంటలు షూటింగ్ చేశాను…. సాధారణంగా 9 నుండి 10 గంటల్లో షూటింగ్ ముగుస్తుంది. నైట్ షూట్స్ ఉంటే ఎల్లప్పుడూ రాత్రి 2 గంటలకే ప్యాకప్ చెప్పేస్తారు తద్వారా తగినంత విశ్రాంతి దొరుకుతుంది. ముంబైలో ఇది మనం ఏ సెట్‌లో ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది అని జాన్వీ వివరించింది.

