- Advertisement -
కేన్స్‌లో మెరిసింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ నెల 13న 78వ కేన్స్ చిత్రోత్సవాలు ప్రారంభంకాగా తొలిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది జాన్వీ. తన లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది జాన్వీ కపూర్.
చూడటానికి కొంచెం సింపుల్ గా ఉన్నా కానీ, ముత్యాలు బీడ్స్ తో ఈ పొడవాటి లెహంగాను సర్వాంగ సుందరంగా డిజైనర్ మలిచారు. గ్లామర్ ని సాంప్రదాయ బద్ధంగా ఎలివేట్ చేసే నైపుణ్యం కనిపించింది. ధడక్ తో ఆరంగేట్రం చేసిన జాన్వీ సహనటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కేన్స్ 2025లో సందడి చేస్తుండడం విశేషం.
అతడు విశాల్ జెత్వా కూడా జాన్వీతో పాటు కేన్స్ లో సందడి చేస్తూ కనిపించారు. ఈ ముగ్గురూ కేన్స్ 2025 లో ‘హోమ్ బౌండ్’ ప్రపంచ ప్రీమియర్ కోసం ఆత్రుతగా కనిపించారు.
Also Read:TG:రెండు రోజులు వర్షాలు
- Advertisement -

