అనర్హత వేటు కక్షపూరిత చర్యే:ఏపీ ఎమ్మెల్సీ

17
- Advertisement -

తనపై అనర్హత వేటు వేయడం కక్ష పూరిత చర్యే అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలోకి జంగా చేరిన సంగతి తెలిసిందే. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారని మండిపడ్డారు.

వెనుకబడిన వర్గాలపై తీసుకున్న బలవంతమైన చర్యే తప్ప మరేమి కాదన్నారు. వైసీపీ నాయకులు మండలి చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి వేటు వేయించారని ఆరోపించిన జంగా… వంశీ , మద్దాలి గిరి పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం బీసీ నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

జంగా కృష్ణమూర్తిపై చర్య తీసుకోవాలని విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేయగా మండలి చైర్మన్‌ మోషేనురాజు.. కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు.

Also Read:Jagan:22 ఎంపీ స్థానాలు మనవే

- Advertisement -