ఏపీలోని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్దమౌతున్నాయి. ఇంకా 10-12 నెలల సమయం ఉన్నప్పటికి ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల నేతలు నిత్యం ప్రజల్లో ఉండాలని అధినేతలు హుకుం జారీ చేస్తున్నారు. అధినేతలు కూడా ప్రజల్లో ఉండేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలను, ఎంపీలను నిత్యం ప్రజల్లో ఉంచుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇక అటు చంద్రబాబు జిల్లాల పర్యటనలు, లోకేశ్ పాదయాత్ర వంటివి చేస్తూ టీడీపీని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అయితే ఏపీలో రైజింగ్ పార్టీగా ఉన్న జనసేన మాత్రం సైలెన్స్ పాటిస్తోంది.
రైతు భరోసా యాత్ర అంటూ, జనవాణి అంటూ పలు కార్యక్రమాలతో గత కొంత కాలంగా ప్రజల్లో ఉంటూ వస్తున్న పవన్. ఈ మద్య మాత్రం చాలా సైలెంట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తన ప్రచార రథం వారాహితో ప్రజల్లోకి వస్తున్నానని, తనను ఎవరు ఆపలేరని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే పవన్ ఇప్పుడేందుకు సైలెంట్ అయ్యారు. ? వారాహి యాత్రను ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు ? వారాహికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తున్నారా ? అనే ప్రశ్నలు ప్రస్తుతం హాట్ హాట్ చర్చలకు తవిస్తున్నాయి. అయితే ఆ మద్య జరిగిన జనసేన ఆవిర్భావ సభలో వారాహి యాత్ర కు సంబంధించి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అని జనసైనికులు ఆసక్తిగా ఎదురు చూశారు. త్వరలోనే వారాహి ప్రజల్లోకి వస్తుందని చెప్పిన పవన్.. ఎప్పుడు రాబోతుంది అనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పవన్ యాత్ర చేపట్టకపోవడానికి కారణం వేరే ఉందని పోలిటికల్ సర్కిల్స్ లో వినికిడి.
ఇవి కూడా చదవండి…