అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై సాగర్ ఫైర్

5
- Advertisement -

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత, తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్‌కే సాగర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేస్తుంటే, ఇతరులను ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఉందా? మీకు సిగ్గుందా? అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను, నాయకత్వాన్ని ముందుగా చూసుకుని మాట్లాడాలని అనిరుధ్ రెడ్డికి హితవు పలికారు.

తెలంగాణలో పుట్టి, తెలంగాణలోనే పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులపై అనిరుధ్ రెడ్డి మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆర్‌కే సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయన ఎమ్మెల్యే ఎలా అయ్యాడో కూడా అర్థం కావడం లేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం లేకుండా, కేవలం విమర్శలకే పరిమితమైన వ్యక్తికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హతే లేదు అని స్పష్టం చేశారు.

Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్‌

పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనతో ఎన్నోసార్లు ప్రజలకు సహాయం చేశారని గుర్తు చేసిన ఆర్‌కే సాగర్…అనిరుధ్ రెడ్డి తన జీవితంలో ఎప్పుడైనా సొంత డబ్బులతో నియోజకవర్గ ప్రజలకు సహాయం చేశాడా? అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల స్థాయిని వెల్లడిస్తున్నాయని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

- Advertisement -