- Advertisement -
ఏపీ ముఖ్యమంత్రితో జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ భేటీ అయ్యారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తొలిరోజు ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్. అనంతరం సీఎం ఛాంబర్ కు వెళ్లి ఆయనతో కాసేపు ముచ్చటించారు జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్.
సీఎం జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మర్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్లు తెలిపారు. పార్టీ మారే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి వరప్రసాద్ ఎన్నికయ్యారు. జనసేన పార్టీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండటంతో వైసిపిలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పడు సీఎం జగన్ తో భేటీ కావడం పలు సంకేతాలకు తావిస్తోంది.
- Advertisement -